అనంతపురం నగరంలోని త్రివేణి సినిమా థియేటర్ వద్ద ప్రమాదవశాత్తు కిందపడిన గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. దీంతో స్థానికులు 108కో సమాచారం అందించడంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అతనికి సంబంధించి వివరాలు తెలియ రాలేదని వైద్యులు తెలిపారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.