గుడివాడ పట్టణం కొత్తపేటలోని శ్రీ విజయ దుర్గ అమ్మవారి దేవస్థానం 18వ వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వార్షిక పూజా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవస్థానం సాంప్రదాయం ప్రకారం, కొత్తపేట నుండి మేళ తాళాల మధ్య మచిలీపట్నం రోడ్డులోని పెద్ద కాల్వ సెంటర్ వరకు భక్తులు, మహిళలు ఊరేగింపుగా తరలి వెళ్లారు. కాలువ వద్ద మంత్రోచ్చరణల మధ్య భక్తులు గంగ పూజలు నిర్వహించారు.