వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు ఎల్ ఎం మోహన్ రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శిగా నియమింపబడిన ఎల్ ఎం మోహన్ రెడ్డి మాట్లాడారు. అనంతపురం జిల్లాతోపాటు సత్యసాయి జిల్లాలో కూడా పార్టీని మరింత బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. మరీ ముఖ్యంగా తాడిపత్రి, రాయదుర్గం నియోజకవర్గం పార్టీని బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.