కొమ్మాది కూడలిలో కాలువ దాటుతూ ప్రమాదవశాత్తు ఆవు కాలువలో జారిపడ్డ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి తాళ్ళు, కర్రల సహాయంతో ఆవును బయటకి తీసేందుకు తీవ్రంగా శ్రమించి బయటకి తీసారు. కాలువలపై ఉన్న మూతలు విరిగి పోవటంతో ఆవు కాలువలో పడిపోయిందని స్థానికులు తెలిపారు. జీవీఎంసీ సిబ్బంది, అధికారులు ఇప్పటికైనా స్పందించి మూతలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.