ఆదాని విద్యుత్ ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టడం అంటే ప్రజలను నమ్మించి వంచిచడమేనని సిపిఎం నాయకులు డీ అప్పలరాజు అన్నారు. జీ వి ఎం సి 5 వ వార్డు పరదేశి పాలెం కొండ ప్రాంతంలో శుక్రవారం ఇంటింటికి పాదయాత్ర నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అప్పలరాజు మాట్లాడుతూ సోలార్ విద్యుత్ కుంభకోణంలో కూరుకు పోయిన ఆదాని కంపెనీని కూటమి ప్రభుత్వం ప్రజలమీదకు పంపుతుందని అన్నారు.స్మార్ట్ మీటర్లను ఇండ్లకు అమర్చి క్రమంగా ఆధాని దోపిడికి ప్రజలను బలి చేస్తారని తెలియ జేశారు. మంచి మాటలతో ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు ఇండ్లకు పెట్టిస్తున్నారని అన్నారు.