బీఎస్పీ ఆధ్వర్యంలో దివ్యాంగుల పింఛన్ల తొలగింపు పై సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఎంపీడీవో గీతావాణికి వినతిపత్రం అందజేసిన ఈ కార్యక్రమంలో బీఎస్పీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య, తాలూకా అధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. దివ్యాంగుల పింఛన్ల తొలగింపు ప్రభుత్వానికి తగదని, ఈ మోసపూరిత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకుని అర్హులైన వారికి పింఛన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.