జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పర్యటించి పంచాయతీ భవన నిర్మాణ పనులను మరియు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో వెళ్లి పరిశీలించారు.అలాగే, జగిత్యాల రూరల్ మండలం కండ్లపెల్లి గ్రామంలోని మోడల్ స్కూల్ లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈ జిఎస్) ద్వారా మంజూరైన అంగన్వాడీ కిచెన్ షెడ్ పనులను పరిశీలించి, నాణ్యతగా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంజనీరింగ్ పంచాయతీ అధికారి లక్ష్మణరావు, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ , ఎంపీడీవో రమాదేవి తహసిల్దార్ మరియు.....