మోస్రా శివారులోని 952 సర్వే నెంబర్ లో ఉన్న వ్యవసాయ పట్టా భూముల వివాదం పరిష్కరించడం జరిగిందని తహసీల్దార్ రాజశేఖర్ వెల్లడించారు. 952 సర్వేనెంబర్ లో ఉన్న వ్యవసాయ పట్టా భూములు గత ఏడు సంవత్సరాల నుండి ఫారెస్ట్ గెజిట్ ల్యాండ్ అనే కారణం వలన అమ్మకాలు కొనుగోలు జరగలేదని ఈ సమస్యను జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ నిర్వహించి సమస్యను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఎందుకు సంబంధించి మంగళవారం 4 గంటలకు ప్రకటన విడుదల చేశారు. ఆ సర్వే నంబర్ లో పట్టా భూములు కలిగి ఉన్న వారు వివాదాస్పదం కానీ కోర్టు కేసులు లేని యజమానులు నేటి నుండి క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.