పేద విద్యార్థుల చదువు కోసం తన శక్తివంచన లేకుండా ఖాసీం వల్లి కృషి చేస్తున్నారంటూ రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదా పీర్, రచయిత గఫార్ తెలిపారు. ఆదివారం కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని పోరుమామిళ్ల గ్రంధాలయంలో లైబ్రేరియన్ ఆఫ్రిది ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చిన సందర్భంగా ఖాసీం వల్లిని శాలువా, పూలదండతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా దాదా పీర్, గఫార్ మాట్లాడుతూ విద్య, సామాజిక రంగాలలో ఖాసీం వల్లి చేస్తున్న కృషిని అభినందించారు. వేసవి సెలవులలో గ్రంథాలయానికి విద్యార్థులను రప్పించి వారిలో పుస్తక పఠనాసక్తిని పెంపుదిస్తున్నారంటూ ప్రశంసించారు.