సిర్పూర్ టి మండలం దుబ్బగూడా గ్రామంలోని మహిళలకు గ్యాస్ వినియోగంపై హెచ్పి గ్యాస్ యజమాన్యం అవగాహన కల్పించారు. వంట గ్యాస్ ను విద్యుత్ స్విచ్ బోర్డులు లేదా కట్టెల పొయ్యిల దగ్గర ఉంచవద్దని మహిళలకు సూచించారు. సిలిండర్ వద్ద ఉన్న గ్యాస్ రెగ్యులేటర్ ను అవసరమైనప్పుడు మాత్రమే ఆన్ చేసి మిగితా సమయాలలో ఆఫ్ చేసి ఉంచాలని తెలియజేశారు.