అనంతపురం నగరంలో కన్నుల పండుగగా ఆదివారం రాత్రి వినాయక నిమజ్జన ఉత్సవాన్ని నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా కేరింతల కొడుతూ అనంతపురం నగరవ్యాప్తంగా వినాయక నిమజ్జన ఉత్సవాన్ని నిర్వహించారు. జై జై గణేశా బై బై గణేశా అంటూ నినాదాలు చేశారు. వివిధ డిజె పాటలతో యువత చిన్నారులు డాన్సులు వేస్తూ అలరించారు.