ఈనెల 15వ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్లను జిల్లా పోలీసు అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పరిశీలించారు. సభా ప్రాంగణం హేలిప్యాడ్ ప్రాంతం ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను మరియు విఐపి రాకపోకల మార్గాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు తెలిపారు.