కాట్రేనికోన మండలం, అడవిపేట లో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లో మంటలు చెలరేగాయి. ట్రాన్స్ ఫార్మర్ నుండి ఒక్కసారిగా మంటలు చేల రేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయాన్ని వెంటనే విద్యుత్ సిబ్బంది కి సమాచారం అందించారు. ఈ ప్రాంతంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగు తున్నాయని, కాలం చెల్లిన ట్రాన్స్ ఫార్మర్లను వెంటనే మార్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు