వినాయక చవితి సందర్భంగా రాయచోటి పట్టణం పండుగ వాతావరణంలో మునిగి ఉంది. రేపు గణనాధులను ప్రత్యేక మండపాల్లో ప్రతిష్టించేందుకు వినాయక చవితి నిర్వాహకులు, యువకులు ప్రతిమలను వివిధ వాహనాలలో తమ ప్రాంతాలకు తరలిస్తున్నారు.పూలు, పండ్లు, అరటి కొమ్మలు, చెరుకులు మరియు ఇతర పూజా సామాగ్రి ధరలు భారీగా పెరిగినా, ప్రజలు కుటుంబసహితంగా వాటిని కొనుగోలు చేసి పూజకు సిద్ధమవుతున్నారు.