ఆళ్లగడ్డలోని వినాయక మండపాలను టౌన్ ఎస్సై నగీన శనివారం పరిశీలించారు. ఆమె మండపాల నిర్వాహకులతో మాట్లాడుతూ.. వినాయక మంటపాల ప్రతీ నిర్వాహకులు ప్రభుత్వపరమైన అన్ని అనుమతులూ పొందాలన్నారు. ముఖ్యంగా డీజేలకు అనుమతి లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.