శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో చోరీ శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో దొంగతనం జరిగింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో రంగులగోపురం దగ్గర దొంగ ఆలయంలోకి చొరబడినట్లు తెలుస్తోంది. భక్తుల కోసం ఏర్పాటు చేసిన రూ.50 టికెట్ కౌంటర్ను బద్దలు కొట్టి రూ.5,800 వరకు అపహరించినట్లు సమాచారం. దీనిపై పోలీసుల విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.