వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట సహకార సంఘం అధ్యక్షులుగా జి ప్రభాకర్ నాయుడు నియమితులైన సందర్భంగా ఆదివారం నాయుడుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, పార్థసారథి దంపతుల తోపాటు మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయుడుపేట నూతన సహకార సంఘం అధ్యక్షులుగా నియమితులైన జి ప్రభాకర్ నాయుడు, టిడిపి నేత కట్టా వెంకటరమణారెడ్డి లతోపాటు పలువురు సహకార సంఘాల డైరెక్టర్లు, తెలుగుదేశం పార్టీ నాయక