రాజులకండ్రిగలో రూ.68 వేలు పలికిన లడ్డూ ఏర్పేడు మండలం రాజుల కండ్రిగ గ్రామంలో ఆదివారం స్వామివారి లడ్డూ వేలం వేశారు. స్వామివారి లడ్డూను రూ.68 వేలకు పర్వతాల మునిరాజు, గీత దంపతులు వేలంలో దక్కించుకున్నారు. అనంతరం వినాయకుని రూపాయి బిళ్లను దివ్య, కరుణాకర్ దంపతులు రూ.46వేలకు దక్కించుకున్నారు. స్థానిక భక్తులు భార్గవి, వెంకటేష్ దంపతులు దేవాలయం వద్ద అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు.