రాజోలు మండలం తాటిపాకలోని కూడలిలో ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని అభివృద్ధి పేరుతో తొలగించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని దళిత చైతన్య వేదిక నాయకులు హెచ్చరించారు. ఈ విషయమై శనివారం రాజోలు మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద వారు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించే ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.