కలికిరి జేఎన్టీయూ కళాశాల సమీపంలో పేకాట శిబిరం పై సోమవారం సాయంత్రం కలికిరి పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి 8మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ ఎస్.అనిల్ కుమార్ సోమవారం సాయంత్రం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు కలికిరి మండలం, కలికిరి పట్టణంలోని జేయన్టియూ ఇంజినీరింగ్ కాలేజీ వెనుక వైపు పేకాట ఆడుతున్నారని అందిన సమాచారంతో తమ సిబ్బందితో వెళ్లి పేకాట శిబిరం పై దాడులు నిర్వహించి పేకాడుతున్న 8 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 6950 రూపాయలు నగదు, 8సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు