వర రామచంద్రపురం మండలంలోని చిన్న మట్టపల్లి పంచాయతీ పరిధిలోని ప్రత్తిపాక గ్రామ శివారులలో గుర్తు తెలియని పురుష మృతదేహం కనిపించిందని ఎస్ఐ సంతోశ్ కుమార్ మంగళవారం తెలిపారు. శబరి నది నుంచి కొట్టుకుని వచ్చి, బోర్లా పడి ఉందన్నారు. వయసు సుమారు 30 నుంచి 35 ఏళ్లు ఉండొచ్చని అన్నారు. ఎత్తు 5 అడుగుల రెండు అంగుళాలు, ఎరుపు రంగు షార్ట్ వేసుకుని ఉందన్నారు. ఎవరైనా గుర్తు పడితే పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు.