ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బెల్ట్ షాప్ పై దాడి చేసి ఒక వ్యక్తిని అరెస్టు చేయడంతో పాటు అతని వద్ద ఉన్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్టు ఆండ్ర ఎస్సై సీతారాం తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన తెలిపిన వివర సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలం చింతాడవలసలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపుపై దాడి చేశామన్నారు. బెల్ట్ షాపును నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్దనుండి 21 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నా మన్నారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.