రెబ్బెన మండల ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ఎదుట సోమవారం మధ్యాహ్నం రోడ్డుపై బైఠాయించి యూరియా కోసం రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నెల రోజుల క్రితం ఇచ్చినటువంటి టోకెన్లకు యూరియా అందించకుండా అధికారులు ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని అన్నారు. నేడు ఒక లారీ లోడ్ యూరియా రాగా అ యూరియాను రైతులకు పంపిణీ చేయకుండా సహకార సంఘం సీఈవో తనకు మీటింగ్ ఉందని బయటికి వెళ్లిపోవడంతో అసహనానికి గురైన రైతులు నెల రోజులపాటు కార్యాలయం చుట్టూ తిరిగిన యూరియా అందించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోడ్డు పై బైఠాయించి ధర్నా చేపట్టారు.