పీలేరు మండలం పీలేరు పట్టణంలోని మార్కెట్ యార్డులో ఈనెల 30న ఉదయం 9.30 గంటలకు జరిగే సూపర్ సిక్స్ పథకాల అమలు విజయోత్సవ సభకు టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పిలుపు నిచ్చారు. సోమవారం సాయంత్రం పీలేరు మండలం పీలేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హాజరై మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేసినట్లు తెలిపారు.