సరూర్నగర్ డివిజన్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మంగళవారం మధ్యాహ్నం అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కాలనీలో చేపట్టవలసిన అభివృద్ధి పనులు పలు సమస్యలను పరిశీలించారు. ముఖ్యంగా డ్రైనేజీలో ఓవర్ ఫ్లో సమస్యతో పాటు శానిటేషన్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.