నారాయణఖేడ్ పట్టణంలోని బసవేశ్వర్ చౌక్ వద్ద కరస్ గుత్తి రోడ్డులో ఉన్న షాపింగ్ మాల్స్ వద్ద పెద్ద పెద్ద బాక్స్ లు, డీజే సౌండ్స్ తో ధ్వని కాలుష్యం చేస్తూ ప్రజల ను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న షాపింగ్ మాల్స్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని ఆర్ పి ఐ అధ్యక్షుడు అలిగే జీవన్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రజల కు ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్టు వ్యవహారిస్తే ఆందోళనలు చేస్తామని అలిగే జీవన్ హెచ్చరించారు.