రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని PDSU నేతలు ఆందోళన చేపట్టారు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో నారా లోకేష్ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఆందోళన చేశారు.