కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని యర్రగుంట్ల మండలం యర్రగుంట్ల పట్టణంలో శుక్రవారం రోడ్డు పక్కన ఉన్నా సైడ్ కాల్వ లో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. ఓ పెట్రోలు బంకులో పెట్రోలు,నీళ్లు కలవడం వల్ల ట్యాంక్ లో నీళ్లన్నీ పెట్రోల్ బంకు సిబ్బంది కాల్వలోకి నీళ్లు తోడుతున్న సమయంలో అనుకోకుండా మంటలు చెలరేగి పెద్ద పెద్ద శబ్దాలతో నిప్పు అంటుకొని మంట లెగిసిపడ్డాయని స్థానికులు తెలిపారు. దీనితో భయబ్రాంతులకు లోనైన జనం రోడ్డుపైకి పరుగులు తీశారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.