సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కమలాపూర్ చెరువులో ఆదివారం 25 ఏళ్ల యువకుడు లతీఫ్ అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నారాయణఖేడ్ పట్టణానికి చెందిన లతీఫ్ చేపలు పట్టేందుకు కమలాపూర్ చెరువు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో నీట మునిగి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాల సేకరిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.