భీమిలి మండలం రేఖవాణి పాలెం పంచాయతీకి చెందిన కె.ఆర్.టి.ఎస్. వెంకటేష్(36) అనే వ్యక్తి అప్పుల బాధ తాళలేక విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు మృతుడుని కేజీహెచ్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.