గోదావరి నది శుక్రవారం ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో అయినవిల్లి మండలంలోని వీరవల్లిపాలెం గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. గోదావరి వరదకు యాదవుల గొర్రెలు, మేకలు పాకలు నీట మునిగాయి. దీంతో వాటిని రైతులు మెరక ప్రాంతానికి తరలించారు. వాటికి మేత కూడా దొరకడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో కుక్కలు దాడి చేసి చంపేస్తున్నాయన్నారు.