రైతులకు సకాలంలో నాణ్యమైన ఎరువులను, ముఖ్యంగా యూరియాను నిర్దిష్ట ధరలకు అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రైవేటు డీలర్లు కూడా నిబంధనల మేరకు పని చేస్తూ అధికార యంత్రాంగానికి సహకరించాలని ఆమె కోరారు. జిల్లాలోని ఎరువుల డీలర్లతో మంగళవారం ప్రకాశం భవనంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ఊపందుకోవటం, ఎరువుల అవసరము - లభ్యత, షాపుల నిర్వహణ తీరు, ఉల్లంఘిస్తే ఎఫ్.సి.ఓ.-1985 చట్టం ప్రకారం తీసుకునే చర్యలపై డీలర్లకు అవగాహన కల్పించారు.