మాజీ గిరిజన సంక్షేమశాఖ మంత్రి కోట్నాక భీంరావు 23వ వర్ధంతిని ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్ పార్కులో శుక్రవారం మధ్యాహ్నం ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల మధ్య డప్పు వాయిద్యాలతో వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎమ్మెల్యే కోవ లక్ష్మీ,అదనపు కలెక్టర్లు పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు,మర్సుకోల సరస్వతి, ఆదివాసీ అధికారులు నాయకులు పాల్గొన్నారు.