నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రజా సమస్యలను పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి చలకాని మల్లయ్య మాట్లాడుతూ 57 సంవత్సరాలు నిండినవారికి పెన్షన్ మంజూరు చేయాలని అన్నారు. మండల వ్యాప్తంగా నిలువుకున్న ప్రజా సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.