జగిత్యాల జిల్లా వర్షపాతం ఇలా గడచిన 24 గంటల్లో జగిత్యాల జిల్లాలో కురిసిన వర్షపాతం వివరాలు (ఈరోజు ఉదయం 8గంటల వరకు) ఇలా ఉన్నాయి. అత్యధికంగా కథలాపూర్లో 94.0, మల్లాపూర్ 75.3, పెగడపల్లి 72.8, గోవిందారం 70.0, పూడూర్ 68.3, జగ్గాసాగర్ 58.8, రాయికల్ 51.0, తిరుమలాపూర్ 49.3, మల్యాల 47.3, కోరుట్ల 46.0, రాఘవపేటలో 42.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ వర్షాలు కురిశాయి.