కడప జిల్లా కమలాపురం వైసిపి కార్యాలయంలో మంగళవారం కమలాపురం వైయస్సార్సిపి ఇన్ చార్జ్ నరేన్ రామాంజుల రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా నరేన్ రామాంజుల రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన వల్ల ఓరిగిందేముందన్నారు.యువగళం పాదయాత్రలో చెప్పిన హామీలు ఏమయ్యాయని, 16 నెల కాలంలో కొప్పర్తికి మీరు తెచ్చిన ఒక కంపెనీ అయినా ఉందా అంటూ ప్రశ్నించారు. వైసిపి హయాంలో శంఖుస్థాపన చేసి పూర్తయిన వాటికి ప్రారంభోత్సవం చేయడం గొప్పతనమా అన్నారు. గత పాలకులు కొప్పర్తి ఇండస్ట్రీయల్ ను విస్మరించారనడం బాధాకరమన్నారు.