విశాఖ డంపింగ్ యార్డ్ లో చికెన్ వేస్ట్ మాఫియాను జీవీఎంసీ సిబ్బంది బుధవారం అర్ధరాత్రి అడ్డగించారు. డంపింగ్ యార్డ్ లో పడేసిన చికెన్ వేస్ట్ ను సైతం మాఫియా తరలిస్తున్నారని అన్నారు. అర్ధరాత్రి పూట చాపకింద నీరులా పదుల సంఖ్యలో వాహనాలతో చేపల చెరువులకు చికెన్ వేస్ట్ ను తరలిస్తున్నారని తెలిపారు. చికెన్ వేస్ట్ మాఫియా వేస్టును తరలిస్తుండగా అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేసేందుకు ప్రయత్నించ్చారని తెలిపారు. ఉన్నతధికారులకు ఈ విషయంపై పిర్యాదు చేసామని వారి ఆదేశాలతో పోలీసులకు పిర్యాదు చేస్తామని తెలిపారు.