చిట్వేల్ టైగర్ ప్రాజెక్టు కారిడార్ లో గత నాలుగు నెలల నుండి పెద్దపులి సంచరిస్తోందని అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిట్వేల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ధీరజ్ పెరుమాళ్ళ తెలిపారు. మంగళవారం మీడియాకు వెల్లడించిన వివరాల మేరకు.. శ్రీ పెనుశిల నరసింహ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధి లోని కెమెరాల్లో రాత్రి, పగలు పెద్ద పులి సంచారం దృశ్యాలు రికార్డు అయ్యాయని తెలిపారు. సోమశిల బ్యాక్ వాటర్, ఒంటిమిట్ట, రాజంపేట, చిట్వేలి, రాపూరు ప్రాంతాలు ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో ఉన్నాయని తెలిపారు. నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వు నుండి చిట్వేల్ కారిడార్ లోకి ప్రవేశించిందని తెలిపారు.