రాజమండ్రి రూరల్ మండలం కాతేరులోని అంగన్వాడి సెంటర్ రెండును సిడిపిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ గౌరీ మంగళవారం సందర్శించారు. ఆమెను స్టేట్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానపు ఏసు కలిసి కొత్త బాలికా సంరక్షణ పథకం 2005 పై చర్చించారు. ప్రభుత్వం ఇచ్చిన బాండ్లు మెచ్యూరిటీ సమయం దాటిపోయి రెండేళ్లు అవుతుందన్నారు. అయినా ఎలాంటి నగదు అందలేదన్నారు, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.