కోడుమూరు, గూడూరు మండలాల్లో ఆదివారం సాయంత్రం వినాయక విగ్రహాల నిమజ్జనం వైభవంగా జరిగింది. ఆయా మండలాల్లోని గూడూరు, బూడిదపాడు, పెంచికలపాడు, నాగలాపురం, లద్దగిరి, అనుగొండ, ప్యాలకుర్తి,అమడగుంట్ల గ్రామాల్లో ఐదు రోజులకు విగ్రహాల నిమజ్జనం జరిపించారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిమజ్జనానికి ముందు విగ్రహాల శోభాయాత్ర విశేషంగా ఆకట్టుకుంది. భక్తులకు ప్రసాదం, త్రాగునీరు ఏర్పాటు చేశారు.