జక్రంపల్లి మండలంలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ ఏవో రాధిక బుధవారం మధ్యాహ్నం 3:45 తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని ప్రతి రైతుకు యూరియా సరఫరా చేస్తామని తెలిపారు. బుధవారం జక్రంపల్లి మండల కేంద్రంలోని గ్రోమోర్ షాపులో యూరియాను పంపిణీ చేస్తున్నామని అవసరమున్న రైతులు వచ్చి తీసుకువెళ్లాలని తెలిపారు.