యూకే , యూరప్ లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. హైదరాబాద్లో ఈ మేరకు యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవ వాల్పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. మొట్టమొదటగా లండన్ లో లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించి, యూకే యూరప్ కంట్రీలలో పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్త) ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్సవాలలో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుండి పురోహితులు యూకే యూరప్ తరలి వెళ్ళనున్నారు.