సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో బిజెపి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు సెక్రటేరియట్ ముట్టడి కి తరలి వెళ్తున్న బిజెపి మండల పార్టీ అధ్యక్షులు దుర్గయ్య, పట్టణ అధ్యక్షులు పూల సంతోష్ తో పాటు పలువురు నాయకులను పట్టణ, రూరల్ పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.