రామాయంపేట మహిళా డిగ్రీ కళాశాలలో చిక్కుకున్న 300 మంది విద్యార్థులను సురక్షితంగా అధికారులు బయటకు తీసుకువచ్చారు. ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షం నీటి వరద కాలనీలోకి చేరడంతో హాస్టల్ ప్రాంగణమంతా జలమయమైంది. వెంటనే స్పందించిన పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని తాడు సహాయంతో మాధ్యాహ్నం వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి వేరే హాస్టల్కు తరలించారు. వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే పరిస్థితి ఎదురవుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించి, కొత్త భవనం నిర్మించాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.