కూకట్పల్లి డివిజన్ హస్బెస్టాస్ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలుడుతో ధ్వంసమైన ఇంటిని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పరిశీలించారు. క్షతగాత్రులకు అందిస్తున్న వైద్యం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.