పీలేరు మండలం వేపులబైలు పంచాయతీ జంగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధరం మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు దేశమంతా కూడా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారని అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ భారత దేశ మొదటి ఉపరాష్ట్రపతి గాను, తర్వాత రెండవ రాష్ట్రపతిగాను పనిచేశారని తెలిపారు. ఇలా ఉపాధ్యాయ వృత్తి నుంచి దేశ అత్యున్నత స్థానం పొందిన సర్వే పల్లి ఉపాధ్యాయ వృత్తికే తలమానికంగా నిలిచారని వారి సేవలను కొనియాడారు.