తిరుపతి జిల్లా గూడూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు సీఐ శ్రీనివాస్ ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకూడదని హెచ్చ రించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో సహకరించాలని కోరారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అల్లర్లు జరిగినా చూస్తూ ఊరుకోం అన్నారు.