హైదరాబాద్ - మచిలీపట్నం పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వేయిస్తున్నాం: ఎంపీ వల్లభనేని బాలశౌరి హైదరాబాద్-అమరావతి గ్రీన్ఫీల్డ్ రోడ్డును మచిలీపట్నం పోర్టు వరకు విస్తరించడానికి కృషి చేస్తున్నట్లు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. సోమవారం మద్యాహ్నం ముడు గంటల సమయంలో స్తానిక మచిలీపట్నంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు విస్తరణపై త్వరలో అధికారులతో సమావేశమై ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు రూ.10కోట్లతో మచిలీపట్నంలో డా. బీఆర్ అంబేద్కర్ భవన్ ను నిర్మిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు.