రాష్ట్రవ్యాప్తంగా యూరియా దొరక రైతులు కన్నీరు పెడుతున్నారని, వారి కన్నీరు చూడలేక ఆందోళన బాట పట్టామని ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో రైతే రాజుగా ఉంటే.. కూటమి ప్రభుత్వంలో రైతులను చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్సీ మాట్లాడారు. రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు డిమాండ్ చేశారు.