గోకవరం మండలం గుమ్మళ్ల దొడ్డి గ్రామానికి చెందిన తల్లి కుమారుడు అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు. ప్రియ కుమారి ఈనెల 23వ తేదీన తన కుమారుడు శేషగిరి (2)తో కలిసి రాజనగరం మండలం కోరుకొండ గ్రామానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె భర్త రాజు చుట్టుపక్కల బంధువుల ఇంటి వద్ద ఎక్కడ కూడా ఆచూకీ లభించలేకపోవడంతో గోకవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.